కరోనాని క్రియేటీవ్ గా ఎదుర్కొవాలి


సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వైరస్‌ను ఆపాలంటే ఓ ప్రణాళిక సూచిస్తున్నారు. గేట్స్ నోట్స్ పేరిట నడిపే బ్లాగ్‌లో ఆ ప్రణాళికను ఆవిష్కరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని గేట్స్ రెండోప్రపంచ యుద్ధంతో పోల్చచారు.

రెండో ప్రపంచయుద్ధం కాలంలో రాడార్‌ను కనిపెట్టడంతో సహా బోలెడు సృజనాత్మకత, విశ్వసనీయమైన టార్పీడోలు, కోడ్ బ్రేకింగ్ వంటివి యుద్ధాన్ని సత్వరం ముగించడంలో తోడ్పడ్డాయి. ప్రస్తుత విశ్వ మహమ్మారి విషయంలోనూ ఇదే జరగాలి. సృజనాత్మకతను నేను ఐదు రకాలుగా విభజిస్తాను. అవి.. చికిత్సలు, టీకాలు, పరీక్షలు, వైరస్‌కు గురైనవారిని వెతికిపట్టుకోవడం, నిబంధనల ఉపసంహరణకు విధానాలని రాసుకొచ్చారు గేట్స్.