1097 కి చేరిన ఏపీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరాయి. మొదట్లో కాస్త తక్కువగా నమోదు అయినప్పటికీ ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావడం మొదలయ్యాయి. నిన్న కరోనా కేసులు వెయ్యి దాటగా తాజాగా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో 81 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసులు 1097కు చేరాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

తాజాగా కోలుకున్న 60మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కోలుకున్న వారి సంఖ్య 231మంది. ప్రస్తుతం 835మంది కరోనా వైరస్ బారిన పడిన ఆస్పత్రుల్లో చికిత్స పొందతున్నారు. వైరస్ బారిన మృతి చెందిన వారు 31మంది ఉన్నారు.

ఇక జిల్లావారీగా కేసులు చూస్తే…

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

* కృష్ణాజిల్లాలో 52
* పశ్చిమ గోదావరి జిల్లాలో 12
* కర్నూలులో 4
* వైఎస్సార్ కడపలో 3
* గుంటూరులో 3
* తూర్పుగోదావరిలో 2
* అనంతపురములో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.