ఏపీ మందు బాబులకు బాడ్ న్యూస్


లాక్‌డౌన్ వల్ల మూసివేతకు గురైన మద్యం దుకాణాలను ఏపీ సర్కార్ తెరుస్తుంది. ఈ సందర్భంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరోసారి పాతిక శాతం ధరలను పెంచింది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి.. షాపుల వద్ద రద్దీని తగ్గించడానికి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

మద్యం ధరలను 25 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం.