అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్ లు మొదలుపెట్టాయి ..

లాక్ డౌన్ కారణంగా గత 45 రోజులుగా అమ్మకాలను నిలిపివేసిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈరోజు నుండి మళ్లీ అమ్మకాలను మొదలు పెట్టాయి. కేంద్రం ప్రకటించిన గ్రీన్ , ఆరెంజ్ ప్రాంతాలలో డెలివరీ చేయనున్నాయి. రెడ్ జోన్లలో ఉండే వినియోగదారులు అత్యావశ్యకమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి ఈ సంస్థలు. సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వస్తువును వినియోగదారుడికి అందించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించాయి. అందులో భాగంగా.. ఇంటి వద్ద లేకపోతే ఇంటి బయట డెలివరీ ఇచ్చేలా.. సంస్థలు డెలివరీ బాయ్స్‌కు సూచనలు చేశాయి.