
అవకాశం లభిస్తే తాను భారత్ బౌలింగ్ కోచ్‌గా ఉండటానికి ఇష్టపడతానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. తాను దూకుడుగా, వేగంగా బౌలింగ్ చేయగలిగే బౌలర్లను తీర్చిదిద్దగలనని వెల్లడించాడు.
తాజాగా, ఓ సోషల్ మీడియా చాట్ లో అభిమాని మున్ముందు అవకాశం వస్తే భారత్ బౌలింగ్ కోచ్ గా పనిచేస్తారా అని ప్రశ్నించగా.. , తప్పకుండా పనిచేస్తానని, టీమిండియా బౌలింగ్ కోచ్ గా పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరాల్లేవని స్పష్టం చేశాడు.
తన బౌలింగ్ పరిజ్ఞానాన్ని వారికీ అందిస్తానని, భారత బౌలర్లను మరింత దూకుడైన బౌలర్లుగా తీర్చిదిద్దుతానని తెలిపాడు. అంతేకాదు, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో కోచ్ గా కలిసి పనిచేయాలనుందని తన మనసులో మాట వెల్లడించాడు.









