ఏపీలో మరో 60 కేసులు

ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1777కి చేరింది.

కాగ ఏపీలో కరోనా మృతుల సంఖ్య 36కి చేరింది. ఇవాళ మరో ఇద్దరు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 729 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1012 మంది చికిత్స పొందుతున్నారు.