దేశంలో పెరుగుతున్న కేసులు.. ఒకేరోజు 5611


దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 5611 పాజిటివ్‌ కేసులు, 140మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3,303 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 42,298 మంది కోలుకోగా మరో 61,149 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒకేరోజు భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.