హోటల్స్ యజమానులు ఇబ్బందులు అన్ని ఇన్ని కావు

కరోనా దెబ్బ అన్ని రంగాల వారిని రోడ్డున పడేసింది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. 60 రోజుల వరకు పూర్తిగా లాక్ డౌన్ చేసిన కేంద్రం ..ప్రస్తుతం సడలింపులు చేసింది. దీంతో పలు షాపులు ఓపెన్ అవుతున్నాయి. అయితే హోటల్స్ కు టిఫిన్ సెంటర్ లకు అనుమతి ఇవ్వకపోవడం తో వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

సాధారణంగా ఒక టిఫిన్ బండికి రోజుకు 2000రూపాయల వ్యాపారం జరిగితే… అందులో లేబర్ ఖర్చు నిర్వహణ ఖర్చులు పోను 500నుండి 700 వరకు మిగిలుతాయి. ఆ టిఫిన్ సెంటర్ వల్ల మరో ముగ్గురికి ఉపాధి లభిస్తుంది. ఫలితంగా వారి జీవనం సాఫీగా జరిగి పోతూ ఉండేది. ఇలాంటి సమయంలో వీరి పాలిట కరోనా శాపంగా మారింది.. రెక్కాడితే గానీ డొక్కాడని వీరి ఆర్ధికచక్రం ఆగిపోయింది. అన్నిటికీ సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం తమకు ఎప్పుడు సడలింపులు ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు టిఫిన్ సెంటర్స్ యజమానులు.