ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా !

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచకప్‌ వాయిదా, ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచకప్‌ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సవాల్‌గా మారింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చిలో ప్రపంచకప్‌ నిర్వహిస్తే బాగుంటుందన్నది క్రికెట్‌ ఆస్ట్రేలియా అభిమతంగా తెలుస్తోంది.