పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్న హార్దిక్‌ పాండ్యా

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్‌ ప్రెగ్నెంట్ అని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఈ మేరకు నటాషాతో దిగిన తాజా ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో ఆదివారం సాయంత్రం పోస్ట్‌ చేశాడు. తనతో జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందున్నా అని, ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను హార్దిక్‌ వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.