డాక్టర్ సుధాకర్ తల్లి ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. సుధాకర్‌ను పోలీసులు, సీబీఐ అధికారులు అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని సుధాకర్ తల్లి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇ
రు వైపులా వాదనలు విన్న తర్వాత .. వైద్యుడు సుధాకర్ డిశ్చార్జికి ఉన్నత న్యాయస్థానం సమ్మతించింది. గత నెల 16 నుంచి డాక్టర్ సుధాకర్ విశాఖలోని మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.









