జ్యోతిల‌క్ష్మీ కి 5 ఏళ్లు..

ఛార్మీ, స‌త్య‌దేవ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్ట్ చేసిన చిత్రం జ్యోతిల‌క్ష్మీ .జూన్ 12,2015లో విడుద‌లైన ఈ చిత్రం నేటితో ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా పూరీ త‌న ట్విట్ట‌ర్‌లో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.

మ‌ల్లాది వెంక‌ట కృష్ణ మూర్తి గారు ర‌చించిన న‌వ‌ల చ‌దివిన‌ప్పుడ‌ల్లా సినిమా చేయాల‌నిపిస్తుంది. జ్యోతిల‌క్ష్మీ ఇప్ప‌టికే ఐదేళ్లు పూర్తి చేసుకుంది. చిత్ర‌బృందంకు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఛార్మీ మంచి న‌టిగానే కాదు నిర్మాత‌గాను రాణిస్తుంది. స‌త్య‌దేవ్ నీ న‌ట‌న‌తో అద‌ర‌గొట్టావు అని ట్వీట్ చేశాడు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ. కాగా ఈ చిత్రం ఛార్మీకి యాక్ట‌ర్‌గా చివ‌రి చిత్రం కాగా, నిర్మాతగా తొలి చిత్రం అన్న సంగ‌తి తెలిసిందే.