ప్రియమణి ఎవరి దగ్గర శిక్షణ తీసుకుంటుందో తెలుసా..?

రానా , సాయి పల్లవి జంటగా ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ ‘వేణు ఉడుగుల’ డైరెక్ట్ చేస్తున్న చిత్రం విరాట పర్వం. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా పోలీస్ గా నటిస్తుండగా సాయి పల్లవి జానపద గాయనిగా మరియు కొన్ని సన్నివేశాల్లో నక్సలైట్ గా కనిపించనుంది.

అలాగే ఈ మూవీ లో ప్రియమణి నక్స్లేట్ రోల్ లో నటిస్తుంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని సమాచారం. తన పాత్ర షూటింగ్ ప్రారంభించడానికి ముందే, కొన్ని రోజుల పాటు మాజీ నక్సలైట్ కింద శిక్షణ పొందినట్లు తెలిసింది. నక్సల్స్ ఎలా పనిచేస్తారు, అలాగే వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రియమణి ఈ శిక్షణ తీసుకుందట. మొత్తానికి ప్రియమణి నుండి మరోసారి జాతీయ అవార్డురేంజ్ యాక్టింగ్ ను ఆశించవచ్చు.