
ఎమ్మెస్ ధోనీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ మరణవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ గురైయ్యారు. అయితే ఈరోజు సుశాంత్ మాజీ ప్రియురాలు ఇవాళ ముంబైలో అతని ఇంటికి వచ్చింది. సుశాంత్‌తో కలిసి 2009లో హిందీ సీరియల్‌తో బుల్లి తెర ద్వారా పరిచయం అయిన విషయం తెలిసిందే.
ఇదే సీరియల్‌లో తనకి జోడీగా నటించిన అంకిత లోఖండేతో సుశాంత్ ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లపాటు వీళ్ల ప్రేమాయణం కొనసాగింది. అయితే 2016లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ – అంకిత లోఖండే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న సుశాంత్ వేరే నటితో డేటింగ్‌లో పడ్డాడు. దీంతో అంకిత తనకి దగ్గరి వ్యక్తితో నిశ్చితార్ధం జరుపుకుందని ప్రచారం కూడా జోరుగా జరిగింది. సుశాంత్ మరణం తర్వాత కుంగిపోయిన అంకిత.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు. కనీసం సుశాంత్‌ను చివరి చూపు చూడాలని భావించినప్పటికీ కూడా కరోనా గైడ్‌లైన్స్ నేపథ్యంలో ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో అంత్యక్రియల తర్వాత అంకిత సుశాంత్ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శంచి ప్రగాఢ సానుభూతి తెలిపింది.









