
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అవకాశాలు లేక ఈయన ఆత్మ హత్య చేసుకున్నాడని సన్నిహితులు చెపుతున్నారు. తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు వీరే కారణమంటూ ఎనిమిదిమంది బాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది.
ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పారంటూ బిహార్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో బుధవారం ఉదయం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్, ప్రముఖ దర్శక నిర్మాతలు కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, హిందీ టీవీ సీరియళ్ల నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్ చీఫ్ ఏక్తా కపూర్ సహా మరో నలుగురి పేర్లను ఆయన ఈ పిటీషన్లో చేర్చారు.
ఈ ఎనిమిది మంది సుశాంత్ మానసికంగా కుంగిపోయేలా చేసి ఆత్మహత్యకి పాల్పడేలా చేశారని పిటీషన్లో పేర్కొన్నారు. వీరిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.









