భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు

గత వారం రోజులు గా దేశం లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గురువారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 53 పైసలు, లీటర్ డీజిల్‌పై 64 పైసలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.77 కాగా లీటర్ డీజిల్ ధర రూ.74.70. ఈ 12 రోజుల్లో పెట్రోల్ ధర రూ.6.55 పెరగగా, డీజిల్ ధర రూ.7.04 పెరగడం జరిగింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే..ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.81 కాగా, డీజిల్ ధర రూ.76.43. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.84.66 కాగా, డీజిల్ ధర రూ.74.93 గా ఉంది. ఈ పెరిగిన ధరలు చూసి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఇప్పుడు పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.