
కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాలో నటించిన వనితా మూడో పెళ్లి కి సిద్ధమైంది. తెలుగు లో పలు చిత్రాల్లో నటించిన ఈమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. ఆ తర్వాత అతనితో మనస్పర్థల రావడం తో అతడికి విడాకులు ఇచ్చి , 2005లో ఆకాశ్ నుండి విడిపోయింది.
ఆ తర్వాత 2007లో ఆనంద్ జయదర్షన్ అనే బిజినెస్ మేన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. ఆ తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది. తాజాగా ఈమె పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈ నెల 27న వివాహాం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ పెళ్లి విషయమై వనిత ఫ్యామిలీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.









