
గత కొంతకాలం గా హిట్ లేని రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ మూవీ , నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాధ్ డైరెక్షన్లో ఓ మూవీ ప్రకటించారు.
రమేష్ వర్మ సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో రవితేజ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అందుకే ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా చిత్రబృందం నభా నటేష్ నే ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో ఐటెం సాంగ్ కోసం ఆర్ ఎక్స్ బ్యూటీ పాయల్ ను ఓకే చేసారని వినికిడి. కాగా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు.









