Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడంటే!

Allu Arjun Fan Meet

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన బన్నీ.. ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావించలేకపోయినా, వారందరూ తన మనసులో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన అల్లు అర్జున్.. “ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు ఎంతో గర్వంగా ఉంది. మీ ప్రేమకు థాంక్యూ” అంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ గురించి కూడా అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి వ్యక్తికి ప్రతిరోజూ 100 శాతం సమయం, ఎనర్జీ ఉంటుందని.. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది వారి నిర్ణయమని చెప్పారు.

“ఎవరైనా నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, ట్రోల్ చేస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీకు నచ్చిన పనులు, మీ లక్ష్యాల కోసం మీ సమయం, శక్తిని వినియోగించండి. నచ్చని విషయాల కోసం ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు” అని సూచించారు. జీవితంలో పాజిటివ్‌గా ముందుకు సాగాలని, మనకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని అల్లు అర్జున్ అభిమానులకు సందేశం ఇచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హేటర్స్‌కు ఇచ్చిన పరోక్ష సందేశం అభిమానులను ఆకట్టుకుంటోంది.