
ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది..అగ్ర హీరోలు , దర్శకులు , నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు , నటించేందుకు పోటీ పడుతున్నారు. సినీ స్టార్స్ కు సైతం భారీ రెమ్యూనరేషన్ ఇస్తుండడం తో వారుకూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రానా, జగపతి బాబు, నవదీప్, అడివి శేష్ లాంటి స్టార్స్ ఇప్పటికే డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు. అలాగే హీరోయిన్లు కియారా అద్వానీ, రాధికా ఆప్టేలు చేసి వెబ్ సిరీస్‌లు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇప్పుడు వీరి లిస్ట్ లో దేశ ముదురు హన్సిక కూడా చేరింది. భాగమతి చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అశోక్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. ఆ వెబ్ సిరీస్ లో హన్సిక నటించబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం అశోక్ దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్ నిర్మాణం జరుగుతోంది. తన భాగమతి చిత్రం తరహాలోనే సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నాడట.హన్సిక విభిన్నమైన పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. ఈమద్య కాలంలో హీరోయిన్ గా అవకాశాలు లేక పోవడంతో హన్సిక ఇలా వెబ్ సిరీస్ ల దారి పట్టింది.









