
లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడగా..
తాజాగా సీరియల్ నటుడు ప్రభాకర్ సైతం కరోనా బారిన పడ్డాడు. జీ తెలుగు లో ప్రసారమై సూర్య కాంతం సీరియల్ లో ఈయన పాల్గొన్నారు. అయితే ఈయనకు కరోనా రావడం తో.. సిబ్బంది మొత్తం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. సదరు టీవీ సీరియల్ షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక ఈ కేసుతో మిగతా సీరియల్ షూటింగ్ లు జరపాలా వద్దా అని అయోమయంలో పడ్డారు.









