
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యముగా మహారాష్ట్రలో మొదటి నుండి కూడా కేసుల్లో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా గత 48 గంటల్లో మహారాష్ట్రలో 185 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం సంచలనంగా మారింది.
కరోనాతో బాధపడుతున్న మరో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. దీంతో మహారాష్ట్ర పోలీస్ శాఖలో నమోదయిన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4288కి చేరింది. ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసులలో 3,239 మంది పోలీసులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.









