
గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ స్టార్స్ కు ఫుల్ రెస్ట్ దొరికింది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వీరు మూడు నెలలుగా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గడుతూ వస్తున్నారు. కొంతమంది వంట వార్పుతో బిజీ గా ఉంటె..మరికొంతమంది వెబ్ సిరీస్ లతో , కొత్తకథలను వింటూ బిజీ గా ఉన్నారు.
ఇక అక్కినేని నాగ చైతన్య మాత్రం ఈ మూడు నెలలుగా ప్రపంచంలో అత్యధికమంది వీక్షించిన చెర్నోబిల్ డైరస్ సీరీస్ ను చూశారట. చాలా ఆసక్తిగా ఉందని, నెక్స్ట్ ఏం జరగబుతోందో అనే క్యూరియాసిటీని కలిగించిందని తెలిపారు. ఈ సీరీస్ తో పాటుగా మనోజ్ భాజ్ పాయి నటించిన ఫ్యామిలీ వెబ్ సీరీస్ ను కూడా చైతూ చూశాడట. ప్రభుత్వం షూటింగ్ లు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో చైతూ తన మూవీ షూటింగ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది.









