
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థలు మార్కెట్ లో ఓ రేంజ్ లో లాభాలు గడిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, ఆల్ట్ బాలాజీ భారతీయ డిజిటల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్స్ అంత ఈ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సైతం వెబ్ సిరీస్ లు నిర్మించే ఆలోచన చేస్తున్నారట. దీని కోసం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరియు సాహూ డైరెక్టర్ సుజీత్ ని కలవడం జరిగిందని టాక్. ఈ ఇద్దరు దర్శకులతో రెండు భారీ వెబ్ సిరీస్ లు నిర్మించాలనేది వీరి ప్రణాళిక అని తెలుస్తుంది. పూరి మరియు సుజీత్ లాంటి దర్శకులు ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లోకి ఎంటరైతే ఈ విభాగానికి మరింత ఆదరణ మరియు ప్రచారం దక్కడం ఖాయం.









