
లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చింది. మూడు నెలల వరకు ఉపశమనం కల్పించింది. విద్యుత్ బిల్లులు చెల్లింపుల విషయంలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. కొందరు ఆన్‌లైన్‌లో చెల్లించినప్పటికీ, మరికొంతమంది కట్టకుండా ఉన్నారు . కాగా ఇప్పుడు మూడు నెలల బిల్లులు ఒకేసారి తీసి ఇవ్వడం తో షాక్ అవుతున్నారు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సెలబ్రటీస్ వరకు తమకు వచ్చిన బిల్లులు వామ్మో అంటున్నారు.
తాజాగా నటి కార్తీక నాయర్ తన ముంబై ఇంటి కరెంట్ బిల్లుని షేర్ చేస్తూ.. బిల్లు చూసి షాక్ అయ్యాను కామెంట్ పెట్టింది. ముంబయిలోని కార్తీక ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. లాక్‌డౌన్ వలన గత రెండు నెలలుగా బిల్లు తీయకుండా ఇటీవల డైరెక్ట్ గా బిల్లు పంపించారు. ఆ బిల్లులో లక్ష రూపాయలు ఉండటం చూసి షాక్ అయినట్టు తెలిపింది కార్తీక. ఇది నా హోటల్ బిల్లు కంటే ఎక్కువగా ఉంది. నా ఇంటికి కరెంట్ బిల్లు అంతగా ఎలా వచ్చింది అంటూ ఆమె సోషల్ మీడియాలో అదానీ గ్రూప్ ను ప్రశ్నించింది. మినిమం కూడా పవర్ వాడకుండానే అంత బిల్లు ఎలా వచ్చిందో మీరే చెప్పాలంటూ ఎలక్ట్రిసిటీ అధికారిక ఖాతాను ట్యాగ్ చేసింది.









