ప్రభాస్ – రానా మాస్క్ వీడియో

ప్రస్తుతం కరోనా ఉదృతి ప్రపంచ వ్యాప్తంగా ఎంత దారుణంగా ఉందనేది చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, సామజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు , డాక్టర్స్ చెపుతున్నారు. సోషల్ మీడియా లోను సినీ , రాజకీయ ప్రముఖులు మాస్క్ లు ధరించాలని చెపుతున్నారు.

తాజాగా బాహుబ‌లి సినిమాకి సంబంధించిన వీడియోని రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ.. అంద‌రు జాగ్ర‌త్త‌లు వ‌హించండి అని పేర్కొన్నారు. రాజ‌మౌళి సృష్టించిన మాహిష్మ‌తి సామ్రాజ్యంలో బాహుబ‌లి, భ‌ళ్ళాలదేవ పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ్యం కోసం వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన యుద్ధానికి సంబంధించిన స‌న్నివేశాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాయి. మ‌న‌దేశంలోనే కాక విదేశాల‌లోను ఈ సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.

తాజాగా మాస్క్‌పై జ‌నాల‌లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు అవినాష్ అండ్ టీం బాహుబ‌లిలోని ఓ స‌న్నివేశాన్ని వాడుకుంది. వీఎఫ్ఎక్స్‌ని ఉప‌యోగించి ప్ర‌భాస్,రానా మ‌ఖాలకి మాస్క్ త‌లిగించి మాహిష్మ‌తిలోను మాస్కులు త‌ప్ప‌నిస‌రి అని వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.