గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న బ్రహ్మానందం ..

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను లెజెండ్ కమెడియన్ బ్రహ్మానందం పూర్తి చేసారు.

యాంకర్ ఉదయభాను బ్రహ్మీకి గ్రీన్ ఛాలెంజ్ ని విసిరింది. తాజాగా ఆ ఛాలెంజ్ ని బ్రహ్మీ పూర్తి చేశారు. దానికి సంబంధించిన పోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.