
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పది వేల మార్క్ దాటగా..తాజాగా ఓ వైన్ షాప్ వ్యక్తికి కరోనా రావడం మందు బాబుల కిక్ తగ్గించింది.
తాజాగా నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న ఒక వైన్ షాపు ఇప్పుడు కలకలం రేపుతోంది. వైన్ షాపులో పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. ఆయన జ్వరంతో కూడా షాపులో మద్యం అమ్మినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ వైన్స్ నుండి దాదాపు 300 వరకు బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతోంది. వైన్స్ లో పని చేసే వ్యక్తికి కరోనా రావటంతో ఆ షాపులో మద్యం కొన్న మందుబాబులు భయపడుతున్నారు. ప్రస్తుతం అధికారులు అతడు ఎవరెవరికి కాంటాక్ట్ అయ్యాడన్నదానిపై ఆరా తీస్తున్నారు.









