ఎన్టీఆర్, త్రివిక్రమ్ కథ ఇదేనా..?

అల వైకుంఠపురం లో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన త్రివిక్రమ్ ..ప్రస్తుతం నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిల్లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలుపెట్టాలన్నది ప్లాన్ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు.

ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌తో పోస్టర్లను కూడా రెడీ చేసి రిలీజ్ చేసారు ఎన్టీఆర్ అభిమానులు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఒకప్పటి చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ సినిమా లైన్‌ను తీసుకొని ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.