బాబోయ్ మరో కొత్త వైరస్

కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. చైనా పరిశోధకులు మరో చేదు అంశాన్ని ఛేదించారు. రాబోయే కాలంలో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. పరిశోధకులను కలవరానికి గురిచేస్తున్న ఈ వైరస్‌కు జీ-4గా నామకరణం చేశారు.

2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ జాతి నుంచే ఇది ఉద్భవించినట్లు పరిశోధకులు గుర్తించారు. ‘‘మనుషులకు సోకడానికి అవసరమయ్యే లక్షణాలన్నీ ఈ వైరస్‌లో ఉన్నట్లు గుర్తించాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు, చైనా ‘వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం’(సీడీసీ) శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ జర్నల్‌లో వారి పరిశీనలను ప్రచురించారు.