టిక్‌టాక్‌కు రూ.45వేల కోట్ల నష్టం..!

కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ తో పాటుగా 59 చైనా యాప్ లపైన నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చైనా విలవిల్లాడుతోంది. అయితే ఈ నిషేధం వల్ల టిక్‌టాక్‌, యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

టిక్ టాక్ అత్యధిక డౌన్ లోడ్లు ఉన్న దేశాలలో భారత్ గత కొద్ది రోజుల నుంచి మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తోంది. దీని తరవాత అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇక భారత్ లో మొత్తం 120 మిలియన్ల టిక్ టాక్ డౌన్ లోడ్లు ఉండగా, ఇప్పుడు అన్ని అన్ ఇన్స్టాల్ అయిపోయాయి. దీనితో టిక్ టాక్ సంస్థ భారీగానే నష్టపోయింది.