
ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా హాట్ హాట్ గా మాట్లాడితే ఏ బాయ్ ఫ్రెండ్ మాత్రం ఊరుకుంటారు చెప్పండి..అదే మాటలకు కాస్త వీడియో కలిపి న్యూడ్ గా చూసుకుంటూ మాట్లాడుకుందాం అంటే ఇంకేమైనా ఉందా ..తన సంతోషం ఆకాశానికి తాకాదు. తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది కానీ ఇంతలో ఏమిజరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ చదవాల్సిందే..
బెంగళూరులో నగరంలోని వైట్‌ఫీల్డ్ దొడ్డనెక్కుండి ప్రాంతానికి చెందిన రాహుల్(పేరు మార్చాం)కి వాట్సాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. తన పేరు నిషా అని.. తనది కేరళ అని చెప్పి క్లోజ్ అయ్యింది. పేయింగ్ గెస్ట్ హౌస్‌లో రాహుల్ ఒక్కడే ఉంటున్నాడు. దీంతో ఇద్దరూ వీడియో కాల్స్ చేసుకుంటూ మరింత రెచ్చిపోయారు.
ఓ రోజు వీడియో కాల్ చేసిన నిషా.. హాట్ మాటలతో రెచ్చగొట్టింది. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుకుందామనడంతో రాహుల్ అబ్బా అని తాను కూడా బట్టలు తీసేస్తానని చెప్పడంతో వద్దు.. వద్దంటూనే ఒప్పేసుకున్నాడు. ఒంటిపై బట్టలను ఒక్కొక్కటి తీసి పక్కన పారేశాడు. ఆమె కూడా బట్టలు తీసేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న రాహుల్‌కి ప్రియురాలు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి షాక్ ఇచ్చింది. మరుసటి రోజు ఆగంతకుడు ఫోన్ చేసి న్యూడ్ వీడియో తన వద్ద ఉందని.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బ్లాక్‌మెయిల్‌కి దిగడంతో రాహుల్‌కి దిమ్మతిరిగిపోయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బేరమాడి రూ.22 వేలు సమర్పించుకున్నాడు. డబ్బులు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాక తనకు ఇంకా డబ్బులు కావాలని బ్లాక్‌మెయిలర్ అడగడంతో చేసేది లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.









