పాము లాంటి చేపను మీరెప్పుడైనా చూసారా..?

సాధారణంగా చేప అంటే ఎంత పొడవు ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ ఏకంగా పామంతా పొడవు చేప కనిపిస్తే షాక్ తో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా కాకినాడలోని కుంభాభిషేకంలోని ఓ బహిరంగ మార్కెట్‌లో గురువారం పాము లంటే చేప కనిపించింది.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

పండు అనే స్థానిక మత్స్యకారుడు దీనిని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చాడు. దీనిని చూసిన వారంతా పాము అనుకుని భయపడ్డారు. అయితే ఇది పాము కాదని, ఓ జాతి సముద్రపు చేప అని పండు వివరించడంతో జనాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. 10 అడుగుల పొడవున్న ఈ చేపను రూ.150కు విక్రయించినట్లు తెలుస్తోంది.