వెలుగులోకి ఒమిక్రాన్ కొత్త లక్షణం ..ఖంగారుపడుతున్న నిపుణులు

కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు హడలిపోతుంటే..ఒమిక్రాన్ వైరస్ సైతం చాప కింద నీరులా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు బయటపడగా..తాజాగా దీని కొత్త లక్షణం వెలుగులోకి వచ్చి నిపుణులను ఖంగారుకు గురి చేస్తుంది.

తాజాగా చెవులపై కూడా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఒమిక్రాన్ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు కరోనా పేషెంట్లపై పరిశోధన నిర్వహించారు. ఇందులో భాగంగా ఒమిక్రాన్ రోగుల అంతర్గత చెవి నమూనాలను పరీక్షించారు. రోగులు చెవి నొప్పి, లోపల జలదరింపులకు సంబంధించిన సమస్యల గురించి ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

మీరు చెవినొప్పి, రింగింగ్, విజిల్ లాంటివి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కరోనా టెస్ట్‌ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే ఒమిక్రాన్ పేషెంట్లలో చెవికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అంతేకాదు ఇది ఎక్కువగా టీకాలు వేసిన రోగులలో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయం బయటకు వచ్చిన దగ్గరి నుండి అంత ఖంగారు పడుతున్నారు.