
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 12 మూవీ కి శ్రీకారం చుట్టారు. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో నాగబాబు సమర్పణ లో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు ఈరోజు హైదరాబాద్ లో పూర్తి అయ్యాయి. మిక్కీ జె మేయర్ ఈ సినిమా కి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.
హీరోయిన్ మరియు ఇతర నటీనటులు మరియు సిబ్బంది గురించి మేకర్స్ తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం వరుణ్ గని మూవీ తో ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.దీంతో పాటు వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 చేసాడు. ఇది కూడా ఏప్రిల్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రవీణ్ సత్తార్ విషయానికి వస్తే..నాగార్జున తో ఘోస్ట్ అనే మూవీ చేస్తున్నాడు.









