విజయ్ – పూరి న్యూ అప్డేట్

పూరి – విజయ్ దేవరకొండ కలయికలో పాన్ ఇండియా మూవీ లైగర్ షూటింగ్ పూర్తి అయ్యింది. విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లో రిలీజ్ చేయబోతున్నాడు.

ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఈ తరుణంలో పూరి విజయ్ కి సంబదించిన సరికొత్త అప్డేట్ ను పంచుకోబోతున్నారు. మార్చ్ 29, 2022 అనగా రేపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేయనుంది. మరి ఆ ప్రకటన ఏంటి అనేది చూడాలి.