ఉత్కంఠభరితంగా రుహాణి శర్మ ‘HER’ ట్రైలర్ !


చిలసౌ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రుహాణి శర్మ కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త జానర్‌లో HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ HER చాప్టర్ 1 ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా వర్చువల్ గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు వరుణ్ తేజ్.

నో నాన్సెన్స్ అంటూ ఓ చమత్కారమైన నోట్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్.. సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచేలా ఉంది. చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను కట్ చేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతూ ఈ ట్రైలర్ వదిలారు. ఇందులో రుహాణి శర్మ ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. మిగిలిన తారాగణం కూడా వారి వారి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ఈ వీడియోలోని ఆసక్తికర డైలాగ్స్ సినిమా రేంజ్ తెలిపేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ ట్రైలర్ సినిమా స్థాయిని పెంచుతూ ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

గతంలో విడుదల చేసిన HER మూవీ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకాదరణ పొందగా.. ఇప్పుడు వదిలిన ట్రైలర్ అంచనాలు నెలకొల్పింది. తొలిసారి ఫిమేల్ లీడ్ చేస్తూ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది రుహాణి శర్మ. కెరీర్ లో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్న ఆమె క్యారెక్టర్ సినిమాలో హైలైట్ అవుతుందని టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమైంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు.