Yesha Nagula: ‘ఏషా నాగుల’ దెబ్బకు యూట్యూబ్ షేక్.. 17 రోజుల్లోనే 100 మిలియన్లు!

Yesha Nagula

Yesha Nagula: టాలీవుడ్ మ్యూజిక్ హిస్టరీలో ఎన్నో చార్ట్‌బస్టర్లు వచ్చాయి.. కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఏషా నాగుల’ సృష్టిస్తున్న ప్రభంజనం మాత్రం మునుపెన్నడూ చూడని రీతిలో సాగుతోంది. యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేస్తున్న ఈ మాస్ సాంగ్, రిలీజ్ అయిన 17 రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ల (10 కోట్ల) వీవ్స్ మైలురాయిని అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా 100 మిలియన్ మార్కును అందుకున్న పాటలుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావా’, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ‘దేవర’లోని ‘చుట్టమల్లే’ టాప్ పొజిషన్‌లో నిలిచాయి. ఆ భారీ రికార్డులను సైతం బద్దలు కొడుతూ ‘ఏషా నాగుల’ అత్యంత తక్కువ రోజుల్లోనే సెంచరీ కొట్టడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

ఒక చిన్న గ్లింప్స్ లేదా లిరికల్ ట్రాక్ ఇంతటి స్థాయిలో వైరల్ అవ్వడం వెనుక పాటలోని మాస్ ట్యూన్, ఊర మాస్ బీట్ కారణమని అంటున్నారు. ఆడియో పరంగానే కాకుండా, విజువల్‌గానూ ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో ఈ పాట ఇంకా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. పాట సాధించిన ఈ అసాధారణ సక్సెస్ కారణంగా ‘ది ప్యారడైజ్’ చిత్రంపై అంచనాలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ల తుఫాను సృష్టిస్తుందో చూడాలంటూ సినీ ప్రియులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.