రివ్యూ : ది 100 | The 100 Telugu Movie Review

The 100 Telugu Movie Review
The 100 review
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

ది 100 : గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ మొగలిరేకులు ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులకు పరిచయమైన RK సాగర్, ఇప్పుడు వెండితెరపై మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాగర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది 100’, జూలై 11న విడుదల కాబోతున్న నేపథ్యంలో ముందుగానే ప్రీమియర్ షో పడింది. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో RK సాగర్ తన అభిమానులను మెప్పించిండా , లేదా అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం..

కథ :
నగరంలోని వరుస రాబరీలు, హత్యలు పోలీస్ శాఖను షాక్‌కు గురిచేస్తున్న తరుణంలో, ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విక్రాంత్ (RK సాగర్) తన మొదటి పోస్టింగ్‌గా ఏసీపీగా బాధ్యతలు స్వీకరిస్తాడు. మొదటిరోజే అతనికి ఈ రాబరీ హత్యల కేసు తన చేతికి వస్తుంది. అత్యంత క్లిష్టంగా మారిన ఈ కేసులో అతని దృష్టి మొత్తం దీనిపై కేంద్రీకరిస్తాడు. ఈ దర్యాప్తు నడుస్తుండగానే అతని గర్ల్‌ఫ్రెండ్ ఆర్తి (మిషా నారంగ్) అత్యాచారానికి గురవుతుంది. ఈ ఘటన విక్రాంత్ మనసును తల్లడిల్లేలా చేస్తుంది. వెంటనే ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటాడు. విచారణలో వారు ఒడిశా ప్రాంతానికి చెందినవారని, ఇప్పటికే పలు హత్యలకు పాల్పడ్డారని తెలుస్తుంది. కానీ ఈ విచారణలో షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. మరి ఆర్తిపై దాడికి పాల్పడింది ఎవరు? అసలైన నిందితులెవరు? ఇక విష్ణుప్రియ ఈ కథలో ఏ పాత్ర పోషించింది? ఈ మిస్టరీకి ఎలాంటి ముగింపు దొరికింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘ది 100’ సినిమాను మిస్ చేయకండి!

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

నటీనటుల పర్ఫార్మన్స్ :
RK సాగర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం ‘ది 100’. ఆయన గతంలో మొగలిరేకులు సీరియల్‌లో RK నాయుడుగా చూపించిన పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను గుర్తు చేసుకునేలా, ఈసారి విక్రాంత్ ఐపీఎస్‌గా మళ్లీ సత్తా చాటారు. ఈ పాత్ర సాగర్‌కి బాగా సెట్ అవ్వడమే కాకుండా, పోలీస్ గెటప్‌లో ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. మిషా నారంగ్ పాత్రకు స్క్రీన్ స్పేస్ తక్కువైనా, తన అందంతో పాటు నటనలోనూ బావుండింది. ధన్య బాలకృష్ణ, లక్ష్మీ గోపాలస్వామి, కళ్యాణి నటరాజన్ – అందరూ తమ పాత్రల పరిధిలో బాగా నెట్టుకొచ్చారు. ముఖ్యంగా తారక్ పొన్నప్ప నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

Also Read :  YouTuber Anvesh : అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు… లుకౌట్ నోటీసుల తర్వాత డిజిటల్ బ్యాన్?

టెక్నికల్‌గా చూస్తే, డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ కథనంలో మ్యాజిక్ చూపారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ భాగాలు ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా, సహజంగా ఉన్నాయి. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ దృశ్యాల్లో విలువ కనిపించేలా చేశాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకు మరో లెవెల్ ఇచ్చింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే, ఇంకా క్రిస్ప్‌గా అనిపించేది. అయినా నిర్మాతలు నిర్మాణ విలువల విషయంలో రాజీ పడకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది — ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా అనిపించింది.

ఫైనల్ గా , ‘ది 100’ ఒక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఇది తప్పకుండా ఆకట్టుకుంటుంది.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5