TELANGANA : కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో కీలక నియామకాలు.. ముగ్గురు జాయింట్ కమిషనర్లు, ఐదుగురు డిప్యూటీలు

Telangan gov

TELANGANA : కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని జాయింట్ కమిషనర్ల ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ , కమర్షియల్ ట్యాక్స్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

Also Read :  KTR : పవన్ కళ్యాణ్ కు కేటీఆర్ కౌంటర్.. తెలంగాణకు అసలైన OG కేసీఆరే!

జాయింట్ కమిషనర్లుగా వాసవి జగన్నాధం, లావణ్య, కె. గీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డిప్యూటీ కమిషనర్లుగా జితేందర్ రెడ్డిని సికింద్రాబాద్‌కు, దీప రెడ్డిని అబిడ్స్‌కు, అరవింద్ రెడ్డిని మధాపూర్‌కు, వేణుగోపాలరావును నిజామాబాద్‌కు, రజనిని కరీంనగర్‌కు నియమించారు. ఈ సందర్భంగా, నియమితులైన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.