Peddi : మెగా ఫ్యాన్స్ కు పూనకాలే.. త్వరలోనే ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్

Peddi

Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం ‘పెద్ది’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించగా, క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంతో కథ సాగనుందని సమాచారం. ఇందులో రామ్ చరణ్ ఓ ‘ఆట కూలీ’ పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చెర్రీ మాసీవ్ గెటప్ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుందని, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 25న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ ఉంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

‘ఫస్ట్ షాట్’ పేరుతో విడుదలైన మూవీ గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో వచ్చే పాటలు మరింత పూనకాలు తెప్పిస్తాయని అభిమానులు నమ్ముతున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న, రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.