War 2 : ‘వార్ ‘2 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది – హృతిక్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా!

War2
War 2 : అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ నుంచి మొదటి పాట విడుదలైంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ ట్రాక్ ‘ఊపిరి ఊయలలాగా’ సోషల్ మీడియా వేదికగా మంచి స్పందన తెచ్చుకుంటోంది. బ్రహ్మాస్త్ర సినిమాలోని హిట్ సాంగ్ ‘కేసరియా’ను రూపొందించిన మ్యూజిక్ టీం ఈ పాటకు కూడా సంగీతం అందించటం విశేషం. హిందీలో ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గొంతు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

తెలుగులో చంద్రబోస్ రచించిన సాహిత్యానికి శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ స్వరాన్ని అందించారు. హృతిక్-కియారా మధ్య కెమిస్ట్రీ, లొకేషన్లు, విజువల్స్ అన్నీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ పాట యూత్‌లో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ ఈ ఏడాది ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్