S.Shankar : హీరోగా శంకర్ కొడుకు.. ఎవరి డైరెక్షన్ లో అంటే..?

Shankar

S.Shankar : డైరెక్టర్ శంకర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు “శంకర్ సినిమా” అంటేనే భారీ స్థాయిలో, కొత్త కాన్సెప్ట్‌లతో వస్తుందని అందరికీ స్పష్టంగా తెలుసు. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా చేసిన రోబో వంటి సబ్జెక్ట్ అప్పట్లోనే పాన్-ఇండియా స్థాయిలో నిలిచింది. ఈరోజు అందరూ పాన్-ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నా, ఆ కాన్సెప్ట్‌ను ముందే ప్రేక్షకులకు పరిచయం చేసినవారిలో శంకర్ ముందున్నాడు. అయితే ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

సినిమా రంగంలో వారసత్వం కొత్త విషయం కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ డైరెక్టర్ల కుమారులు హీరోలుగా ప్రయత్నించినా అందరికీ అది ఫలించలేదు. ఉదాహరణకు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ఇంకా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ కుమారుడు దర్శకుడిగా అడుగులు వేస్తుండగా, శంకర్ కూతురు ఇప్పటికే హీరోయిన్‌గా సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇప్పుడు శంకర్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శివ పరిచయం అవుతున్నారు. ఆయన గతంలో అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారని సమాచారం. పెద్ద దర్శకులు వరుసగా డిజాస్టర్లను ఎదుర్కొన్నప్పుడు హీరోల డేట్లు పొందడం కష్టం అవుతుంది. అలాంటి సమయంలో ఇంట్లోనే హీరో ఉంటే అది ప్లస్ పాయింట్‌గా మారుతుంది. శంకర్ కుమారుడు హీరోగా ప్రూవ్ అయితే, భవిష్యత్తులో తండ్రి-కొడుకు కాంబినేషన్‌లో సినిమాలు రావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో పూరి తనయుడితో ప్రయత్నించిన ఈ ఐడియా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కానీ శంకర్ తనయుడు సక్సెస్ అయితే, తమిళ్ సినిమాల్లో కొత్త డైనమిక్‌ను సృష్టించే అవకాశముంది.