Allu Kanakrathnamma : అల్లు కుటుంబంలో విషాదం.. కనకరత్నమ్మ కన్నుమూత..

Allu kanakaratnamma
Allu Kanakrathnamma : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) శనివారం అర్ధరాత్రి వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కోకాపేటలో నేడు మధ్యాహ్నం తర్వాత ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. తల్లి మరణవార్త తెలిసి అల్లు అర్జున్ ముంబై నుంచి, రామ్ చరణ్ మైసూర్ నుంచి బయలుదేరారు. వీరిద్దరూ మధ్యాహ్నం లోపు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ఇప్పటికే అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా అక్కడికి చేరుకొని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  Peddhi Movie Budget: "పెద్ది" బడ్జెట్‌లో సగం జీతాలేనా! రెమ్యూనిరేషన్ల కోసమే రూ. 170 కోట్లా?

అల్లు రామలింగయ్య–కనకరత్నమ్మ దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. వారిలో అల్లు అరవింద్, కుమార్తె సురేఖ మాత్రమే సినీ ఇండస్ట్రీకి సన్నిహితంగా ఉన్నారు. ఈ తరంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోలుగా ఎదిగారు. అల్లు రామలింగయ్య 2004లో కన్నుమూశారు. కనకరత్నమ్మ మాత్రం పబ్లిక్‌గా ఎక్కువగా కనిపించలేదు. భర్త శతజయంతి సందర్భంగా, అలాగే పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నానమ్మగా దిష్టి తీశిన వీడియో మాత్రం అప్పట్లో వైరల్ అయింది.

Also Read :  Peddi OTT Partner: అఫీషియల్.. ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ లాక్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

“ఆమె మాకు ఆదర్శం” – చిరంజీవి
అత్తయ్య అల్లు కనకరత్నమ్మ మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఇరు కుటుంబాలపై చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు మార్గదర్శకం. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.