సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జటాధర’ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రేరణ అరోరా సమర్పణలో వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక తాజాగా ఈ చిత్రంలో శోభ అనే కీలక పాత్రలో నటించిన శిల్పా శిరోద్కర్‌పై నిర్మాత ప్రేరణ అరోరా నమ్మకం వ్యక్తం చేశారు. 90వ దశకంలో ‘ఖుదా గవా’, ‘మృత్యుదండ’ వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న శిల్పా, ఈ సినిమాలో తన నటనతో మళ్లీ అందరినీ ఆశ్చర్యపరుస్తారని ఆమె చెప్పారు.
‘‘‘జటాధర’లో శిల్పా శిరోద్కర్ పోషించిన శోభ పాత్ర చాలా శక్తివంతమైనది, సంక్లిష్టమైనది. ఆమె తన నటనతో పాత్రకు అద్భుతమైన ఇన్‌టెన్సిటీ తీసుకువచ్చారు. ఈ సినిమా తర్వాత ఆమె అవార్డులన్నీ గెలుస్తారని నాకెంతో నమ్మకం ఉంది’’ అని ప్రేరణ అరోరా అన్నారు.
‘జటాధర’ సస్పెన్స్, యాక్షన్, మిస్టరీల మేళవింపుతో గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. శిల్పా శిరోద్కర్‌తో పాటు సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన శోభ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకుంది. ప్రేక్షకులకు ‘జటాధర’ ఒక కొత్త అనుభూతిని, విజువల్ వండర్‌ను అందిస్తుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.













