Daksha : ఓటీటీలోకి వచ్చేసిన మంచు లక్ష్మి క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘దక్ష’!!

Daksha ott
నటి మంచులక్ష్మీ మెయిన్ రోల్ లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’. వంశీ కృష్ణ మల్లా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది. తాజాగా ఈ మూవీ ఓటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి (అక్టోబర్ 17) అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ మూవీలో మంచు లక్ష్మీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇందులో మోహన్ బాబు క్రూషియల్ రోల్ లో కనిపించి సందడి చేశారు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ సినిమా కథ విషయానికొస్తే, హైదరాబాద్‌లోని కంటైనర్ యార్డులో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవుతాడు. ఈ కేసును దక్ష టేకప్ చేస్తుంది. ఆ తర్వాత ఒక అమెరికన్ ఫార్మా కంపెనీ ప్రతినిధి కూడా అదే రీతిలో మరణిస్తాడు. ఇదే క్రమంలో జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) డాక్యుమెంటరీ తీసే క్రమంలో దక్షను అదే పనిగా ఫాలో అవుతుంటాడు. మరి ఇంతకీ ఆ హత్యలు చేసిందెవరు? ఆ డాక్యుమెంటరీలో వున్న ట్విస్టులు ఏంటి? ఈ రెండు కేసుల్ని దక్ష ఎలా సాల్వ్ చేసింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

సముద్ర ఖని, ‘రంగస్థలం’ మహేష్, యంగ్ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, మలయాళ యాక్టర్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో కనిపించారు. కథలో మంచు లక్ష్మీ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్, కేసు ఛేజ్ చేసే క్రమంలో ఆమె పర్ఫార్మెన్స్ అదిరిపోతాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇందులో సీరియస్ పాత్ర చేసింది మంచు లక్ష్మీ. యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లలోనూ కట్టిపడేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా అలరించిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఓటీటీలో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ దీపావళికి థియేటర్లలోనే కాదు ఓటీటీలో దక్ష మూవీతో హంగామా మొదలైంది.