Raja Saab : మౌత్ టాక్ మారుతోందా? ‘ది రాజా సాబ్’కు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్…

Rajasaab kingsize
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ క్రమంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నిన్న నైట్ షోలలో సినిమా మంచి ఆక్యుపెన్సీ నమోదు చేయగా, రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా కొనసాగుతున్నాయి. థియేటర్ల వద్ద వినిపిస్తున్న టాక్ ప్రకారం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యారని తెలుస్తోంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్స్ సమయంలో కొంత నెగిటివ్ టాక్ వచ్చినా, సాధారణ ప్రేక్షకుల నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. వినోదం, ఫాంటసీ ఎలిమెంట్స్ కలగలిపిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా వింటేజ్ స్టైల్‌లో ప్రభాస్ కనిపించడం, ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్‌గా మారిందని టాక్.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

దర్శకుడు మారుతి తన రెగ్యులర్ జానర్‌కు భిన్నంగా చేసిన ఈ కొత్త ప్రయత్నం సక్సెస్ అవుతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పండగ రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కొనసాగితే వసూళ్లు మరింత బలపడే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈరోజు నుంచి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీన్స్ అదనంగా యాడ్ చేస్తున్నట్లు ఈ రోజు థాంక్ యు మీట్ లో దర్శకుడు మారుతి చెప్పడంతో సినిమాకి మరింత మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.