రివ్యూ : స్కై | SKY Movie Review

Sky movie
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
మురళీ కృష్ణంరాజు హీరోగా పరిచయం అవుతూ, శృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ “స్కై” సినిమాకి శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ కంపోస్ చేశారు. ఇంతకు ముందే రిలీజ్ అయిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ “స్కై” మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులని ఎంత వరకూ ఆకట్టుకుంది ఈ రివ్యూలో చూద్దాం.

కధ: మొదటి నుంచి చివరి వరకూ కధ మొత్తం ముఖ్యంగా మూడు కారక్టర్స్ పై నడుస్తుంది. సింగర్ గా సక్సస్ అయ్యి లైఫ్ లో సెటిల్ అవుదామనుకున్న ప్రభు (ఆనంద్), ఫామిలీని అశ్రద్ద చేసి తన ఫోకస్ అంతా కెరీర్ మీదే పెట్టడం వలన బార్య, పదేళ్ళ కొడుకుని దూరం చేసుకుంటాడు. ప్రభు ఫ్యామిలీ ని పట్టించుకొక పోవడంతో భార్య చనిపోతుంది, తర్వాత పదేళ్ళ కొడుకుని హాస్టల్ లో జాయిన్ చేసిన ప్రభు సింగర్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభుకి దూరంగా ఉంటూ, హాస్టల్లో ఉన్న పదేళ్ళ కొడుకు ఒంటరి తనాన్ని భరించలేక సూసైడ్ చేసుకుంటాడు. ఫ్యామిలీని కోల్పోయిన ప్రభు తాను అనుకున్నది సాదించలేక చివరకి రెస్టారెంట్స్ లో లైవ్ సింగర్ గా లైఫ్ కంటిన్యూ చేస్తుంటే, ఆది(సందీప్) మ్యూజిక్ బ్యాండ్ తో పరిచయం అయ్యి లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడుతూ తన ఒంటరితనాన్ని అదిగమిస్తూ ఉంటాడు.

ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన కాళ్ళ మీద తాను బతుకుతున్న విక్కీకి చిన్ననాటి స్నేహితుడు జాఫర్ (మహబూబ్) పరిచయం అవుతాడు. బ్రతుకు తెరువుకోసం వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ఫుడ్ డెలివరీ చేస్తుంటే, విక్కీకి వీణ (శృతి శెట్టి) పరిచయం అవుతుంది. అంతకు ముందే జాఫర్ వీణాని చీట్ చేసి ఆమె వద్ద డబ్బులు నొక్కేయడంతో వీణ విక్కీని అనుమానిస్తుంది. విక్కీ బిహేవియర్ లో ఉన్న సింప్లిసిటీ, నిజాయితీకి ఇంప్రెస్ అయ్యి వీణ విక్కీ ప్రేమలో పడుతుంది. కానీ తన లైఫ్ లో ఎవరూ లేక, చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితం సాగిస్తున్న విక్కీ సడన్ గా తన లైఫ్ లోకి వచ్చిన వీణాని, ఆమె ప్రేమని అంగీకరించలేడు. విక్కీ గతం ఏంటి? విక్కీ వీణ ప్రేమని ఎందుకు ఆక్సెప్ట్ చేయలేకపోయాడు? చివరికి విక్కీ వీణ ప్రేమని అర్దం చేసుకున్నాడా? సూసైడ్ అటెంప్ట్ చేసుకుని కొడుకు చనిపోయాడు అని భాదతో జీవిస్తున్న ప్రభుకి చివరిగా ఎవరి వలన స్వాంతన కలుగుతుంది? కధ ఎలా క్లైమాక్స్ కి చేరి ఎలా సుఖాంతం అవుతుంది తెలియాలంటే ఈ స్కై మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

విశ్లేషణ: ప్రస్తుత గజిబిజి ప్రపంచంలో మనుష్యుల తమ జీవితాల్లో అనుభవిస్తున్న ఒంటరితనాన్ని, ఆ ఒంటరితనంలో మనుషులు అనుభవించే బావోద్వేగాలని డైరెక్టర్ పృధ్వీ పేరిచెర్ల తనదైన శైలిలో ఈ స్కై మూవీలో ఆవిష్కరించారు. సవంత్సరాల తరబడి ఒంటరితనం అనుభవిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రభు, విక్కీ, వీణ, వాళ్ళ జీవితంలో ఫేస్ చేసిన పరిస్తితుల వలన వాళ్ళు కోల్పోయింది ఏంటి? ఎలాంటి పరిస్తితులు ఎదురైనా స్ట్రాంగ్ ఉండి పరిస్తితులని ఫేస్ చేస్తూ లైఫ్ లో వాళ్ళు సాదించింది ఏంటి? అసలు ఆ ఒంటరితనం వాళ్ళకి నేర్పించింది ఏంటి? అనేదే ఈ కథ. హీరో హీరోయిన్స్ పోషించిన విక్కీ, వీణ క్యారక్టర్స్ మరియు ఆనంద్ పోషించిన ప్రభు క్యారక్టర్ డైరెక్టర్ ఫస్టాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన విదానం చాలా ఇంటరెస్టింగ్ గా వుంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనయింగ్ గా సాగుతూ హీరోయిన్ కి హీరో మీద ప్రేమ ఎలా పుట్టింది అనేది డైరెక్టర్ చాలా సెన్సిబుల్ గా ఇంటర్వెల్ సీన్ లో చూపించారు. హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు అయినా చాలా చక్కగా కారక్టర్స్ లో ఒదిగిపోయి నటించారు. ఈ మూడు కారక్టర్స్ ని కధలో పేర్లల్ గా నడిపిస్తూ దర్శకుడు పృధ్వీ పేరేచర్ల చాలా హృద్యంగా తెరపై ఆవిష్కరిచారు. దీనికి తోడు ఎంటర్టైన్మెంట్ కి కూడా స్టోరీలో ప్రాదాన్యం ఇవ్వడంతో మూవీ ఎక్కడా బోర్ అనిపించదు.

ఇక సెకండాఫ్ విషయానికొస్తే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ డైరెక్టరే రాయడం వలన కధ మీద ఎక్కడా ఆయన పట్టు కోల్పోలేదు. ఈ ఎమోషనల్ డ్రామాలో కారక్టరైజేషన్స్, వాళ్ళ బ్యాక్ డ్రాప్ అంతా చాలా డెటెయిల్ గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు పృధ్వీ సక్సస్ అయ్యాడు. ఫస్టాఫ్ లో ఇంట్రడ్యూస్ చేసిన కారక్టర్స్ అన్నీ కూడా సెకండాఫ్ స్టోరీని నడిపించడంలో చివరివరకూ కంటిన్యూ అవడం వలన సెకండాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంది. కొత్త వాళ్లయినా ఈ ఎమోషనల్ డ్రామాలో ఆర్టిస్ట్స్ అందరూ చక్కగా వారి వారి కారక్టర్స్ లో బాగా నటించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ మూవీకి సెకండఫే ప్రాణం. ఎక్కడా బోర్ కొట్టకుండా చివరికి వరకూ డైరెక్టర్ కధ, కధనాలని నడిపించాడు. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల మనుసుని హత్తుకునేలా వుంటుంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

నటన & సాంకేతిక విశ్లేషణ: డెబ్యూ మూవీలో హీరోగా చేసిన మురళీ కృష్ణంరాజు నటనలో పర్వాలేదని పించాడు. విక్కీ పాత్రలో కామెడీ, రొమాంటిక్ సీన్స్ బాగానే చేసినా సెకండాఫ్ లోని ఎమోషన్స్ సీన్స్ ఇంకా బాగా పెర్ఫార్మ్ చేస్తే బాగుండేది. శృతి శెట్టి నటన ఆకట్టుకుంటుంది. వీణ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. చాలా రోజుల తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ ఆనంద్ ఒక ఫుల్ లెంగ్త్ పాత్ర పోషించారు. ప్రభు కారక్టర్ లో ఆయన జీవించారనే చెప్పాలి. రాకేశ్ మాస్టర్, మణిబామ్మ ఉండేది ఒక్కొక్క సీన్ లోనే అయినా ఆ సీన్ బాగా వర్క్అవుట్ అయ్యింది. మిగతా కొత్త వాళ్ళు అంతా వాళ్ళ కారక్టర్స్ లో బాగా నటించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, పృధ్వీ దర్శకత్వ ప్రతిభకి తోడు రసూల్ ఎల్లోర్ ఎక్స్ట్రా ర్డినరీ సినీమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ అని చెప్పాలి. ప్రతీ ఫ్రేమ్ విజువల్ గా చాలా రిచ్ గా తెరకెక్కించడంలో సక్సస్ అయ్యారు. మూవీ బిగినింగ్ టైటిల్స్ లో హైదరాబాద్ సిటీ ని ఏరియల్ షాట్ లో చూపించిన విధానం అద్బుతం. సీనియర్ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఎడిటింగ్ వర్క్ కూడా ఈ మూవీకి ప్లస్. శివప్రసాద్ కంపోస్ చేసిన సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి. సాంగ్స్ అన్నీ సిచ్యువేషన్ గా ఉండడం వలన స్టోరీ చాలా ఇంటరెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. మూవీ క్లైమాక్స్ వరకూ ఎక్కడా ఒక్క సీన్ కూడా బోర్ అనిపించదు. చిన్న బడ్జెట్ మూవీ అయినా నిర్మాణ విలువలతో మూవీని తెరకెక్కించిన నిర్మాతలకి అబినందనలు చెప్పి తీరాలి.

ఓవరాల్ గా, ఈ “స్కై” మూవీ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ.

తెలుగుమిర్చి రేటింగ్ : 3/5