
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద సుమారు 18 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ.18 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా లగేజ్ బ్యాగుల కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన స్థలంలో గంజాయిని దాచినట్లు గుర్తించారు. స్కానింగ్ సమయంలో బయటపడిన ఈ వ్యవహారంపై NDPS Act కింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









