Suriya48: ‘జై భీమ్’ కాంబో రిపీట్.. సూర్య 48వ సినిమా షూటింగ్ ఎప్పుడంటే?

Suriya

Suriya 48: భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న హీరో సూర్య. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో సూర్య – టాలెంటెడ్ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read :  Peddi Pre-Sales: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఊచకోత.. రిలీజ్‌కు ముందే రూ. 22 కోట్ల కలెక్షన్లు!

హీరో సూర్య కెరీర్‌లో ఈ సినిమా #Suriya48 గా తెరకెక్కే అవకాశం ఉంది. ‘జై భీమ్’ తరహాలోనే ఈ సినిమా కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపుదిద్దుకనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ జ్ఞానవేల్ రీసెర్చ్ వర్క్ పూర్తి చేసి సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారని సమాచారం. హీరో సూర్య ప్రస్తుతం ఉన్న తన లైనప్‌ను కంప్లీట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అతి త్వరలోనే వచ్చే చాన్స్ ఉందంట. ‘జై భీమ్’ వంటి సక్సెస్‌ఫుల్ కాంబో మళ్లీ సెట్ అవ్వడంతో సూర్య ఫాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.